కొత్తగూడెం లోని నూతనంగా ఏర్పాటు చేసిన డా మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ లో బీటెక్, బీఎస్పీ మొదటి సెమిస్టర్ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఓరియెంటేషన్ కార్యక్రమం శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈయొక్క కార్యక్రమంకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొని విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..... దేశంలోనే నూతనంగా ఏర్పాటు చేసిన ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ లో జరిగే మొదటి ఓరియెంటెషన్ కార్యక్రమంకు రావడం సంతోషకరమని అన్నారు.