పాలకీడు డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్రిక్తత నెలకొంది. నిన్న ఫ్యాక్టరీలో పని చేస్తూ మృతి చెందిన కార్మికుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు. కార్మికులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా, ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన కార్మికులు పోలీసులపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనతో పోలీసులు వెనక్కి తగ్గాల్సి వచ్చింది.