వి.కోట పట్టణంలో హిందూ ముస్లింలు కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. గతంలో జరిగిన ఓ సంఘటన ఇరు మతాల మధ్య దాడులకు దారి తీశాయి.అప్పట్లో ఎస్పీ మణికంఠ చందోలు మత ఘర్షణలు ఏమాత్రం ఉపేక్షించబోమని ఇరు వర్గాలను తీవ్రంగా హెచ్చరించారు. పీస్ కమిటీ ఏర్పాటు చేసి మత సామరస్య దిశగా అడుగులు వేశారు. పీస్ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలో హిందూ ముస్లింలు బాయి బాయి అంటూ ర్యాలీ చేసి తమ ఐక్యతను చాటుకున్నారు.