Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 31, 2025
భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ మండల కేంద్రంలో ఆదివారం ఉదయం 11 గంటలకు యూరియా కొరతపై బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించినట్లు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని,రైతులను గోస పెడుతున్న ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని,బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు.నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో యూరియా దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియా అందించాలన్నారు.