అన్నదాత పోరు పోస్టర్ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే వైసిపి పార్టీ ఆధ్వర్యంలో రైతుల ఎరువుల కోతలపై ఈ నెల 9వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించనున్నారు. అందులో భాగంగా ఆదివారం శ్రీకాళహస్తిలోని వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈనెల 9వ తేదీన పార్టీ కార్యా లయం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలుపుతామని ఆయన తెలిపారు.