హనుమంతునిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ మద్యం కేసుల్లో స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను బుధవారం ఒంగోలు ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ వెంకట్, ఎస్సై మాధవరావు ధ్వంసం చేశారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. పోలీస్ స్టేషన్ పరిధిలో సీజ్ చేసిన 3.8 లీటర్లు నాటుసారా, అలాగే 53 మద్యం బాటిళ్లను పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోనే ధ్వంసం చేశారు. జిల్లాలో ఎక్కడైనా అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరిండెంట్ వెంకట్ హెచ్చరించారు.