తన భూమికి సంబంధించి నష్ట పరిహారం చెల్లించాలని కలెక్టరేట్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఓ రైతు గుండె పోటుతో మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గుండాల బాలకిట్టు కు చెందిన వ్యవసాయ భూమి 2 ఎకరాల 22 గుంటలు భూమి మల్లన్నసాగర్ అదనపు టీఎంసీ కాలువలో పోతుందని అధికారులు సర్వే చేశారు. అందుకు సంబంధించిన నష్ట పరిహారం చెక్కును అందజేయాలని పలుమార్లు కలెక్టరేట్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అందులో భాగంగానే గురువారం సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయానికి ఉదయం వెళ్లగా.. సాయంత్రం వరకు అక్కడే పడిగాపులు కాసాడు.