గుర్తుతెలియని దుండగులు 30 మేకలను ఎత్తుకుపోయిన ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం బాధిత రైతు బాలయ్య తెలిపిన విరాల ప్రకారం.. కుల్కచర్ల మండల పరిధిలోని బండ ఎల్కిచర్ల గ్రామ సమీపంలో బీరప్ప గుడి సమీపంలో ఉన్న షెడ్డులో 30 మేకలను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకుపోవడం జరిగిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు వాటి విలువ ఐదు లక్షల రూపాయలు ఉంటుందని, సంబంధిత అధికారులు వచ్చి పరిశీలించి నష్టపరిహారం వచ్చే విధంగా కృషి చేయాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపాడు.