గుంటూరు జిల్లా పొన్నూరు మండలం రమణప్పపాలెంలో తామర పూలు కోయడానికి వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందిన విషాద ఘటన బుధవారం చోటు చేసుకుంది. బాపట్ల జిల్లా పూండ్లకు చెందిన శ్రీమంత్, నాగభూషణం రమణప్పపాలెంలోని తమ బంధువుల ఇంట్లో బస చేసి ఉన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ అలంకరణ కోసం దగ్గరలోని వ్యవసాయ కుంటలో తామర పూలు కోయడానికి వెళ్లారు. ఈ క్రమంలో ఇద్దరూ ప్రమాదవశాత్తు నీట మునిగి మరణించారు. దీంతో ఈ గ్రామంలో విషాదం నెలకొంది.