ఆత్మకూరు పట్టణంలో శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డీ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి స్త్రీ శక్తి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మెగా డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు సాధించిన మహిళా మణులు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకంతో తమ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఇంటికి దీపం ఇల్లాలు స్త్రీ మూర్తులు సంతోషంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంతో ఉంటుందని కూటమి ప్రభుత్వం స్థాపించిన నీ సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ గా ప్రజలకు లబ్ధి చేకూర్తున్నాయని అన్నారు.