కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల్లోని పెద్ద చెరువు ప్రమాదకర స్థితిలో ఉందని దీని ప్రభావం మెదక్ జిల్లా నిజంపేట్లోని మూడు గ్రామాలకు కూడా ఉండే అవకాశం ఉందని జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ జిల్లా కలెక్టర్తో మాట్లాడారు. సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన సహాయ సహకారాలు వెంటనే అందించాల్సిందిగా బుధవారం ఆదేశించారు. అదేవిధంగా సంగారెడ్డి కలెక్టర్తో మాట్లాడి సమన్వయం చేశారు. భారీ వర్షాలని పద్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలని ఎంపీ సూచించారు.