జజ్జహతి ప్రాజెక్టుని ఎప్పుడు పూర్తి చేస్తారని సిపిఐ (ఎంఎల్) రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి తోట జీవన్న ప్రశ్నించారు. శుక్రవారం పార్వతీపురంలో పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత 50 ఏళ్లుగా ఒడిస్సా వివాదం నెపంతో జంఝావతని పాలకులు పూర్తి చేయలేదన్నారు. ఇప్పుడు ఆంధ్రాలో ఒడిస్సాలో బిజెపి అనుకూల ప్రభుత్వాలు ఉన్నాయన్నారు. కాబట్టి తక్షణమే జంఝావతి ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.