కాసిపేట మండలంలోని లంబాడితండా, ధర్మరావుపేట గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్లలో జరిగిన అవకతవకల కారణంగా గ్రామస్తులు అధికారులపై తిరగబడ్డారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ అర్హుల జాబితాలో కాంగ్రెస్ నాయకుల పేర్లు తప్ప అసలైన నిరుపేదల పేర్లు లిస్టులో లేకపోవడం దారుణమన్నారు అధికారులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సర్వే ను నిలిపివేసి అధికారులు తిరిగి వెళ్లిపోయారు