వైయస్సార్ కడప జిల్లా కడప నగరంలోని ఆలంఖాన్ పల్లె సర్కిల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. రాయచోటికి వెళ్లే దారిలో ఆల్విన్ డివైడర్ పై ఉన్న చెట్టును ఢీకొనడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో డ్రైవర్ బయటపడగా వాహనం దెబ్బతింది. పెద్ద ప్రమాదమే తప్పిందని స్థానికులు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.