భారీ వర్షాల కారణంగా జులూరుపాడు, చండ్రుగొండ మండలాలలో సోమవారం వాగులు,వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి.జులూరుపాడు మండలంలో కాకర్ల ఎర్రవాగు ప్రాజెక్టు నిండి అలుగు పోయడంతో బ్రిడ్జి పై నుండి ఉదృతంగా వరద ప్రవహిస్తుండడంతో కాకర్ల- అనంతారం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.చండ్రుగొండ మండలంలో పోకల గూడెం- బాల్యతండాల మధ్య వాగు ఉదృతి కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.వర్షాల ధాటికి పంటలు నీట మునిగి అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.