పలమనేరు: మున్సిపల్ పరిధి గంటాఊరు నందు సుజాత అనే మహిళ తన ఇద్దరు పుట్టుకతోనే వికలాంగులైన పిల్లలు జయప్రకాష్ ప్రవీణ్ లతో కాపురం ఉంటుంది. ఈమెకు భర్త చనిపోయిన కారణంగా విడో పింఛన్ 4000తో కలిపి శాశ్వత వికలాంగులైన ఇద్దరు పిల్లలకు 15,000 + 15,000 చొప్పున మొత్తం 34,000 లబ్ధి చేకూరుతోంది. గత వైసిపి ప్రభుత్వంలో 5000 వచ్చేది, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తమను కన్న బిడ్డల్లాగా చూసుకుంటూ ఒకటవ తేదీ వస్తేనే 34000 కమీషనర్ రమణారెడ్డి తమకు చేతిలో పెడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డికి కృతజ్ఞతలు అంటూ కన్నీరు పెట్టుకున్నారు.