అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని నరసాపురం గ్రామానికి చెందిన వెంకటేష్ 58 సంవత్సరాలు ద్విచక్ర వాహనంపై వెళ్తూ జారిపడి మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని బెలుగుప్ప ఎస్ఐ శివ శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు పేర్కొన్నారు. మృతుడు వెంకటేశులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండగా గ్రామానికి చెందిన మరో వ్యక్తి మారుతి కి చెందిన ద్విచక్ర వాహనంపై కళ్యాణ్ దుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి వెళుతు గురువారం రాతపడి తీవ్ర గాయాల పాలయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో మృతుని కుమారుడు మంజునాథ్ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.