మూర్ఛ వ్యాధితో భాధపడుతూ వరి పొలంలో పడి వ్యక్తి మృతి సంఘటన సిద్దిపేట అర్బన్ మండలం ఏన్సాన్ పల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులు గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్సాన్ పల్లి గ్రామానికి చెందిన పూస లచ్చవ్వ వ్యవసాయ వరి పొలంలో సిద్దిపేట పట్టణం శ్రీనగర్ కాలనీకి చెందిన తంగళ్ళపల్లి నర్సింహచారి(50 ) అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుని జేబులో ఉన్న ఆధార్ కార్డ్ ఆధారంగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడు కొద్దిరోజుల నుండి మూర్ఛ వ్యాదితో భాదపడుతూ.. పని నిమిత్తం వెశ్తున్నానని చెప్పి ఇంట్లో నుండి వెళ్ళి తిరిగి రాలేదన్నారు. ఆచూకీ తెలియకపోవడంతో