ఎస్.బాబా ఫక్రుద్దీన్, సెక్రటరీ-మరియు-సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కడప వారు కడప పురుషుల కేంద్ర కారాగారము మరియు ప్రత్యేక మహిళా కారాగారాలను, ప్రిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్ లను విజిట్ చేయడం జరిగినది. ఈ సందర్భంగా ఖైదీలతో మాట్లాడి వారి కేసు వివరాలను, ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు, ఉచిత న్యాయ సహాయమును సద్వినియోగం చేసుకోవాలి అన్నారు, అనంతరం జైలు పరిసరాలను పరిశీలించి తగు సూచనలను సలహాలను ఇవ్వడం జరిగినది, లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రాధాన్యతను తెలియజేశారు, లీగల్ ఎయిట్ బాక్సులను పరిశీలించడం జరిగినది, జైలు లోపల ఖైదీల హక్కులు, ఉచిత న్యాయ సహాయము వివరించారు.