Mahadevpur, Jaya Shankar Bhalupally | Aug 22, 2025
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా లక్ష పుష్పార్చన పూజలు వైభవంగా నిర్వహించారు.శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ అనుబంధ దేవాలయమైన శ్రీ శుభానంద దేవి ఆలయంలో అమ్మవారికి ఆలయ అర్చక బృందం వేద మంత్రోచ్చరణలతో విశేష పూజలు నిర్వహించారు. కల్యాణ మండపం వద్ద మహిళలు సాముహిక లలిత సహస్రనామ పారాయణ,అష్టోత్తర పూర్వక వివిధ రకాల పూలతో పుష్పార్చన పూజ, అమ్మవారికి నక్షత్ర హారతి ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ్ర, ప్రసాదాలను అందజేసారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ మహేష్, సుహసీనులు అధిక సంఖ్యలో పాల్గోన్నారు.