కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం సంగెం గ్రామ శివారులో పేకాట స్థావరంపై శనివారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. విశ్వాసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించడం జరిగిందన్నారు. 8 బైక్లు, రూ.4,500 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు. ఎవరైనా పేకాట, గంజాయి, మత్తు పదార్థాలు కు పాల్పడితే చర్యలు తీసుకుంటామని ఎస్సై అరుణ్ కుమార్ హెచ్చరించారు. దాడుల్లో కానిస్టేబుళ్లు రమేష్, శ్రీధర్, గౌరీ ఉన్నారు.