పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు విద్యుత్ ఘాతం కారణంగా మృత్యువాతకు గురై 'పాడె' ఎక్కడంతో దేవరకద్ర మండలం చిన్న రాజమూరు గ్రామానికి చెందిన గోపాల్ అనే వ్యక్తి కుటుంబం దుఃఖ సాగరంలో మునిగిపోయింది. అందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం వన్ టౌన్ విద్యుత్ సబ్ స్టేషన్ లో పనిచేస్తున్న జూనియర్ లైన్ మెన్ అరుణ్ కుమార్ విధి నిర్వహణలో భాగంగా పట్టణంలోని కుర్వినిశెట్టి కాలనీలో గల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద బుధవారం రాత్రి మరమ్మత్తులు చేయబోయి ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందాడు. దేవరకద్ర మండలం చిన్న రాజమూర్ గ్రామానికి చెందిన అరుణ్ కుమార్ జిల్లా