గ్రామీణ ప్రాంతాల,గ్రామాల ప్రజల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదని పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన పనుల జాతర కార్యక్రమంలో శుక్రవారం పాల్వంచ మండలం పరిధిలోని జగన్నాధపురం తోగ్గూడెం గ్రామాల్లో జరిగిన గ్రామసభల్లో *కొత్వాల* పాల్గొన్నారు.