వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింత నెక్కొండ శివారు ఏపీ తండాలో భూక్య బాలు అనే రైతు 5 ఎకరాలలో వ్యవసాయ క్షేత్రంలో పత్తి పంటను సాగు చేస్తున్నాడు. ఈ సందర్భంగా వివిధ దఫాలుగా ఏరియా కోసం ఎంత ప్రయత్నం చేసినరగా యూరియా దొరకకపోవడంతో రేపు మాకు అంటూ అధికారులు పూట గడుపుతుండటంతో ఆగ్రహించిన రైతు ఆవేదనతో తన వ్యవసాయ క్షేత్రంలోని పత్తి చెట్లను శుక్రవారం సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో పీకి వేశాడు. ఈ ఘటన ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను యూరియా విషయంలో మోసం చేస్తుందని రైతు బాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.