కడప జిల్లా జమ్మలమడుగు మండలం పి.బొమ్మేపల్లె, చుట్టుపక్కల గ్రామపంచాయతీలలో రైతుల కరెంటు వైర్లను తరుచూ దొంగతనాలు చేసేవారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదివారం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కార్యదర్శి మనోహర్, టౌన్ కార్యదర్శి ఏసుదాసు,కమిటీ సభ్యులు వినయ్,విజయ్,లు సంయుక్త ప్రకటనలో తెలిపారు.సామాన్య పేద రైతాంగం పంటలు పండించుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తున్నారని తెలిపారు. అలాంటి సామాన్య రైతాంగం తెచ్చుకున్న కరెంటు వైర్లను నిత్యం దొంగతనాలు చేయడం దుర్మార్గమని తెలిపారు. ఇలాంటి దొంగతనాలకు పాల్పడిన వారిని కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరారు.