అన్నదాత సుఖీభవకు సంబంధించి ఫిర్యాదులు పరిష్కరించి, అర్హులైన వారికి పథకం ప్రయోజనాలను అందించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులతో వీసీ నిర్వహించారు. భూముల రీసర్వే, మ్యుటేషన్ల ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలన్నారు. అటవీ హక్కు పత్రాలు ఇచ్చిన భూముల లబ్దిదారుల ఆధార్ సీడింగ్ చేసి అన్నదాత సుఖీభవ అందేలా చర్యలు చేపట్టాలన్నారు. జలపాతాలు ఉన్న చోట అప్రమత్తంగా ఉండాలన్నారు.