వనస్థలిపురంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఈరోజు సాయంత్రం 07:30 నుంచి 07:50 మధ్యలో కరెంటు నిలిచిపోయింది. దాంతో ప్రధాన రోడ్లు, కాలనీలు, వీధులు అంధకారమయ్యాయి. చిన్నారులు, చంటిపిల్లల తల్లులు ఆరుబయట అరుగులపై కూర్చున్నారు. దాంతో స్థానికులు కాస్త అసౌకర్యాన్ని గురయ్యారు. 20 నిమిషాల అనంతరం మళ్లీ కరెంట్ రావడంతో వాళ్ల పనుల్లో నిమగ్నమయ్యారు.