మహబూబాబాద్ జిల్లా, గార్ల మండల కేంద్రం నుండి మద్దివంచ గ్రామ పంచాయతీలకు వెళ్లే మార్గమధ్యలో ఉన్న మున్నేరు వాగు పై హై లెవెల్ వంతెన నిర్మాణం చేపట్టాలని కోరుతూ, అదే విధంగా మున్నేరుపై చెక్ డాం నిర్మించి కాలువల ద్వారా గార్ల మండలంలో ఉన్న ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని కోరుతూ ,ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో గార్ల మండల కాంగ్రెస్ పార్టీ నేతలు ,మాజీ ప్రజాప్రతినిధులు, పట్టణవాసులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని మర్యాదపుర్వకంగా కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు .