భీమ్ గల్ మండలం లోని పిప్రీ గ్రామంలో నూతనంగా ఆకు పేపర్ ప్లేట్ తయారు మిషన్ ను mpdo గంగుల సంతోష్ కుమార్, APM ప్రమీల ప్రారంభించారు.ఈ సందర్భంగా mpdo మాటాడుతూ ప్లాస్టిక్ పేపర్ వాడకం ద్వారా ఆరోగ్యం పాడు అవుతుందనే ఉద్దేశంతో ఆకుతో పేపర్ ప్లేట్లు తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఆకు పేపర్ ప్లేట్ వాడితే ఆరోగ్యం కాపాడుకున్న వారిమి అవుతామని అన్నారు.ఈ కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చిన లావణ్య , లక్ష్మి , దుర్కి లక్ష్మి, విశాల,రత్న లను అభినందించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ప్రవీణ్ ,మాజీ ఎంపిటిసి సరిత స్వామి, జేమ్స్ ,విడిసి సభ్యులు, CC లు శ్రీనివాస్,నరేష్ పాల్గొన్నారు.