కామారెడ్డి జిల్లాలో గత మూడు నాలుగు రోజులుగా కూర్చున్న భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా అతలాకుతలమైంది, రోడ్లు, డ్రైనేజీలు, రైల్వే ట్రాక్ ఇలా చాలా మటుకు కొట్టుకుపోయి. అయితే సికింద్రాబాద్ - నిజామాబాద్ రైల్వే మార్గంలో తలమడ్ల వద్ద భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న ట్రాక్ మరమ్మత్తులు పూర్తయ్యాయి. మూడు రోజులుగా నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు, 36 గంటలపాటు రైల్వే కార్మికుల శ్రమతో యాథావిధిగా కొనసాగుతున్నాయి. మొదట డెమో ట్రైన్ లను, ట్రాక్ ను అధికారులు తనిఖీ చేయగా, అనంతరం తిరుపతి నుంచి నిజామాబాద్ వైపు వెళ్లే రాయలసీమ ఎక్స్ప్రెస్ తలమడ్ల స్టేషన్ మీదుగా వెళ్ళింది.