రైతులకు సరిపడా యూరియా అందించాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మహబూబాబాద్- తోరూర్ ప్రధాన రహదారిపై బైఠాయించి రైతులు రాస్తారోకో నిర్వహించారు, అధికారులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు ,రైతుల రాస్తారోకోకు మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మద్దతు తెలిపి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలతో అధికారం చేపట్టి రైతులకు రైతుబంధు ,రైతు బీమా, కనీసం రైతులకు యూరియా కూడా అందించలేకపోతుందంటు విమర్శించారు