పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఘనపూర్ గ్రామంలో జేసీ కన్స్ట్రక్షన్స్ వారి ఆధ్వర్యంలో 4.7 ఎకరాల్లో నూతనంగా చేపట్టనున్న లావెండర్ స్కై ప్రాజెక్ట్ నిర్మాణ పనుల ప్రారంభత్సవానికి ముఖ్య అతిథిగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్చెరు నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ రంగంలో నూతన ప్రాజెక్టులు రావడం సంతోషకరమన్నారు.