కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్వాయిలో యూరియా కోసం రైతులు నిరసన చేపట్టారు. సోమవారం గ్రామ ప్రధాన రహదారిపై గుమిగూడి జై జవాన్ - జై కిసాన్ అంటూ నినాదాలు చేశారు. ప్రతి రైతుకు పంట అవసరానికి తగినంత యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పంటకాలం ముగిసిన తర్వాత ఎరువు ఇచ్చినా ప్రయోజనం ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. సొసైటీ అధికారులు వచ్చి రైతులను నచ్చజెప్పడంతో శాంతించారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రకారం ప్రతి రైతుకు యూరియా అందించడం జరుగుతుందని తెలిపారు.