సిద్దిపేటలో ట్రిప్పర్స్ ఓనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నట్లు ఆదివారం తెలిపారు . సిద్దిపేటలో ఇందిరమ్మ ఇండ్లకు, రైతులకు చదును చేయడానికి టిప్పర్లతో ఒక చోట నుండి మరో చోటుకు మట్టిని తరలిస్తే స్థానిక మైనింగ్ అధికారులు, సిద్దిపేట టాస్క్ పోర్స్ పోలీసులు దాడులు చేసి, ట్రిప్పర్ తిరగకుండా అడ్డుకుంటున్నారని ట్రిప్పర్ల ఓనర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించి ట్రిప్పర్లు నడుపుకునే విధంగా అనుమతులు ఇవ్వాలని వారు కోరారు. పోలీసులు ఎక్కడ దొరికితే అక్కడ ట్రిప్పర్లను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించడంతో వాహనాల ఈఎంఐలు కట్టే పరిస్థితి లేదన్నారు