ఎల్లారెడ్డి మండల ముదిరాజ్ మహాసభ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో పార్థ సింహారెడ్డికి వినతిపత్రం సమర్పించి, ముదిరాజ్ వర్గానికి తక్షణ న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో అధిక జనాభా కలిగిన ముదిరాజ్ వర్గం రాజకీయ, ఆర్థిక పరంగా వెనుకబడింది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం, కాంగ్రెస్ పార్టీ మరియు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం ముదిరాజులను బీసీ–డి నుండి బీసీ–ఏ లోకి మార్చాలి, కానీ జి.ఓ. నెం.15 జారీ అయినప్పటికీ ఇప్పటివరకు అమలు కాలేదని సంఘం కార్యవర్గ నాయకులు విమర్శించారు.