నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో వైకాపా ఆధ్వర్యంలో అన్నదాత పోరు కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి నందికొట్కూరు వైఎస్ఆర్సిపి ఇన్చార్జి ధారా సుధీర్ మరియు వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆత్మకూరు లోని వైసీపీ కార్యాలయం నుంచి ఆర్డిఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆత్మకూరు పట్టణ శివారులో ఉన్న ఆర్డీవో కార్యాలయం చేరుకొని ఆర్డీవో నాగజ్యోతికి వినతి పత్రం శిల్పా చక్రపాణి రెడ్డి, ధారా సుధీర్ అందజేశారు.ఎరువుల బ్లాక్ మార్కెట్ నియంత్రించాలని ఎరువులతో పాటు సరిపడ యూరియా అందించాలన్నారు.