మద్దిపాడు: సంక్షేమ పథకాలతో తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహోన్నత నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అని సంతనూతలపాడు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. మంగళవారం వైయస్సార్ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా మద్దిపాడు లో వైసీపీ శ్రేణులతో కలిసి వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నాగార్జున ఘన నివాళులు అర్పించారు. వైయస్సార్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా నాగార్జున పిలుపునిచ్చారు.