స్విగ్గి జొమాటో రైడర్ సమర్స్ పరిష్కారం చేయాలని బైక్ యాత్ర డైమండ్ పార్క్ వద్ద సాయిరాం పార్లర్ వద్ద మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా బిగ్ వర్కర్స్ యూనియన్ విశాఖ జిల్లా అధ్యక్షులుబి.జగన్ మాట్లాడుతూ వారంలో ప్రతి శనివారం ఆదివారం సమ్మె చెస్తామని,విశాఖపట్నం జిల్లాలో గత 7 సంవత్సరాలుగా స్విగ్గీ జమాటో ప్లాట్ఫారమ్ లో పనిచేస్తున్న సుమారు 40,000 మంది గిగ్ వర్కర్లు రోజూ సమాజానికి సేవలందిస్తున్నా, వారికి ఎటువంటి ఉద్యోగ భద్రత, స్థిరమైన ఆదాయం, సామాజిక భద్రత లేక అనేక ఇబ్బందులు పడుతున్నాము. ఉన్నత విద్యను పూర్తి చేసినప్పటికీ ఉపాధి అవకాశాల లేవన్నారు