సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యాలయాలు, హాస్టళ్ళలో ఉంటున్న విద్యార్థులకు మంచి విద్య, భోజనము, వసతితోపాటు వారి ఆరోగ్యంపైనా మరింత దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. గురువారం వివిధ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో తన క్యాంపు కార్యాలయంలో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రెసిడెన్షియల్ విద్యాలయాలతో పాటు హాస్టళ్లలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు - ఖాళీలు, మౌలిక సదుపాయాలు, సొంత - అద్దె భవనాలు, వాటిని ఉన్నతాధికారులు తనిఖీ చేస్తున్న తీరు, విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న విధానం, ఆహార నాణ్యత గురించి జిల్లా కలెక్టర్ ఆదేశాలను జారీ చేశార