జిల్లాలో స్థానిక సమస్యలను పరిష్కరించాలని భారీ వర్షాల వల్ల నష్టపోయిన ప్రజలకు రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని, అదనపు కలెక్టర్ కు సిఐటియు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా CITU జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ జిల్లాలో అంగన్వాడి, ఆశ, గ్రామపంచాయతీ, బిల్డింగ్ వర్కర్స్, మున్సిపల్, మధ్యాహ్న భోజనం వివిధ రంగాలలో కార్మికులు పనిచేస్తున్నారన్నారు. కనీస వేతనాలు ఉద్యోగ భద్రత ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం పర్మినెంట్ చేయాలన్నారు. గ్రామపంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, మౌలిక సదుపాయాలను కల్పించాలని, సబ్బులు, నూనెలు, బూట్లు, బ్యాటరీ సైకిల్, సెలువులు ఇవ్వాలన్నారు.