Download Now Banner

This browser does not support the video element.

నరసాపురం: తూర్పుతాళ్ల వద్ద గణేశ ఊరేగింపులో అపశృతి, ట్రాక్టర్ చిన్నవాడు నడపడంతో ప్రమాదానికి గురై 4 మంది మృతి. ఒక వ్యక్తికి గాయం

Narasapuram, West Godavari | Aug 31, 2025
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలం తూర్పు తాళ్ల వద్ద గణేష్ ఊరేగింపు సందర్భంగా దుర్ఘటన చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి 9.00 గంటలకు సమయంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో 4 మంది మరణించగా, 1 వ్యక్తి గాయపడ్డారు. సంఘటన వివరాలను తెలుసుకొని క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని నరసాపురం ఆసుపత్రి సూపరింటెండెంట్ ను కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. ఈ దుర్ఘటనపై పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. హుటాహుటిన నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి బయలుదేరి వెళ్ళారు.
Read More News
T & CPrivacy PolicyContact Us