సూర్యాపేట జిల్లాలో యూరియా కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజుల తరబడి వ్యవసాయ సహకార సంఘాల చుట్టూ తిరిగినా యూరియా లభించకపోవడంతో ఆవేదన చెందిన రైతులు, సూర్యాపేట పట్టణంలోని సీతారాంపురంలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచే తాము యూరియా కోసం ఎదురుచూస్తున్నామని వాపోయారు.