విద్యార్థులకు ఆదర్శంగా ఉపాధ్యాయుల సేవలు ఉండాలని సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో ఏఐ ద్వారా బోధన అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయులు ఛాలెంజింగ్తో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆఫీసర్లు పాల్గొన్నారు.