కామారెడ్డి :కాంగ్రెస్ పార్టీ ఈ నెల 15 న కామారెడ్డిలో నిర్వహించ తలపెట్టిన బీసీ కృతజ్ఞత సభ వాయిదా పడింది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సభను వాయిదా వేయాలని అధికార పార్టీ నిర్ణయించింది. 42శాతం బీసీ రిజర్వేషన్లపై మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న తరుణంలో బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ తలచింది. బీసీ డిక్లరేషన్ విజయోత్సవ బహిరంగ సభను వాయిదా వేస్తున్నట్లు జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క చెప్పారు. శుక్రవారం మాచారెడ్డి మండలంలో కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బహిరంగ సభను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు