గాజువాక లంక గ్రౌండ్స్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన లక్ష చీరల వినాయకుడి నిర్వాహకులు దర్శనం కోసం వచ్చిన భక్తులపై దాడికి దిగడంతో ఈ విషయం పోలీసుల వరకు వెళ్ళింది. బాధితులు మాట్లాడుతూ తాము దర్శనం కోసమే వచ్చామని ఫ్రీ దర్శనానికి పంపించమంటే ఖచ్చితంగా 25 రూపాయల కుంకుమ పూజలు దర్శనం తీసుకోవాల్సిందేనని నిర్వాకులు పట్టుబడ్డారని తెలిపారు . మాకు కుంకుమ పూజలు అవసరం లేదని చెబుతున్నప్పటికీ బలవంతంగా డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించారని తీసుకోకపోతే దాడికి దిగారని తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ఈ ఘటనలు ఓ పాపకు గాయాలయ్యాయని ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.