తుగ్గలి మండలం రాతన గ్రామానికి చెందిన రంగస్వామి అనే రైతు ఉరివేసుకుని మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై బాల నరసింహులు తెలిపిన వివరాల ప్రకారం రాతన గ్రామానికి చెందిన రంగస్వామి పొలం కు చేసిన అప్పులు ఎక్కువ కావడంతో మరియు జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.