సూర్యాపేట జగదీశ్ రెడ్డిపై ఎమ్మెల్యే మందుల సామేలు తీవ్ర విమర్శలు చేశారు. జగదీశ్ రెడ్డి బ్లాక్మెయిలర్ అని, ఆయనది చిల్లర బతుకు అని మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవిత జగదీశ్ రెడ్డిని 'లిల్లీ ఫూట్' అని అనడాన్ని తాను సమర్థిస్తున్నట్లు తెలిపారు. గురువారం నాగారం మండలం ఫణిగిరిలో ఆయన మాట్లాడారు. తామిద్దరం సహచర ఉద్యమకారులమని, ఆయన గురించి తనకు బాగా తెలుసని, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పెద్ద మోసగాడని పేర్కొన్నారు.