కొండపాక మండల పరిధిలోని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆదివారం ఆకస్మికంగా సందర్శించి సాయంత్ర వేళల్లో విద్యార్థులకు అందించే బోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భోజనం ఎలా ఉంది, బాగా పెడుతున్నారని విషయాలు ఆరా తీశారు. బాగానే పెడుతున్నారని విద్యార్థులు కలెక్టర్ కి తెలిపారు. కామన్ డైట్ మెనూ పాటించాలని విద్యార్థులకు నాణ్యమైన ఆహార పదార్థాలతో రుచికరంగా వండాలని సిబ్బందినీ ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా విద్య, భోజనం, వసతి కల్పించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.