రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం మాన్వాడ గ్రామ శివారులో సోమవారం 9:10 PM కి 2 ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొని రోడ్డు ప్రమాదం జరిగిన ఘటన చోటుచేసుకుంది,సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన మనోజ్ తన ద్విచక్ర వాహనంపై బావు పేట వెళ్తున్న క్రమంలో కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన రాజేష్ వేములవాడ వెళుతుండగా, మానువాడ గ్రామ శివారు వద్దకు రాగానే రాజేష్ ముందున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న మనోజ్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు,దీంతో ఇరువురికి తీవ్ర గాయాలు కాగా హుటాహుటిన స్థానికుల సహాయంతో 108 వాహనంలో చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు,