ధర్మవరం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్తి కుమార్ యాదవ్ను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా నూతన ఎస్పీగా ఇటీవలే సతీష్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ జిల్లా ఎస్పీతో మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో ఎటువంటి రాజీ లేకుండా కఠినంగా వ్యవహరించాలన్నారు.